దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం – సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Says will Construct Temple and Mosque in Secretariat Premises, KCR Regrets Razing Of Mosques, Mosque in Secretariat, Telangana High Court halts demolition, telangana secretariat, Telangana Secretariat Demolition, Temple and Mosque in Secretariat, Temple and Mosque in Secretariat Premises, Temple and Mosque in Secretariat Premises at the Government Cost, Temples

తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారాన్ని, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణయంలో, విశాలంగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

‘‘తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చివేసి, కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో అక్కడున్న ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందనే విషయం నాకు తెలిసింది. ఇలా జరగడం పట్ల నేను ఎంతో బాధపడుతున్నాను. చింతిస్తున్నాను. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని” సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

‘‘ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఎన్నికోట్లయినా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి, వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తాం. దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =