తెలంగాణలో 17 మంది అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) నియామకం

17 Officers Posted as Additional Collectors Local Bodies in Telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు 17 మంది అధికారులను (8- ఐఏఎస్, 9 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు) అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూలై 14, మంగళవారం నాడు 2 జీవో లను జారీ చేశారు. ఈ నియామకాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 29 జిల్లాలకు అదనపు కలెక్టర్లను (స్థానిక సంస్థ) నియమించినట్టు అయింది. అలాగే యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్‌ జి.రమేశ్‌ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.

ఐఏఎస్‌ అధికారులు – అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) నియామకం:

  • అనుదీప్‌ దురుశెట్టి – భద్రాద్రి కొత్తగూడెం
  • కోయ శ్రీహర్ష – జోగుళాంబ గద్వాల
  • అభిలాష అభినవ్‌ – మహబూబాబాద్‌
  • బి.సత్యప్రసాద్‌ – రాజన్న– సిరిసిల్ల
  • కుమార్‌ దీపక్‌ – పెద్దపల్లి
  • ఆదర్శ్‌ సౌరభి – ములుగు
  • భోర్ఖాడే హేమంత్‌ సహదేవ్‌రావు – నిర్మల్‌
  • తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ – మహబూబ్‌నగర్‌

నాన్ క్యాడర్ ఆఫీసర్స్ (స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు) – అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) నియామకం:

  • కోట శ్రీవాత్సవ – వనపర్తి
  • జాల్దా అరుణశ్రీ – జగిత్యాల
  • అనుగు నర్సింహారెడ్డి – కరీంనగర్‌
  • కందూరి చంద్రారెడ్డి – నారాయణపేట
  • ఎన్‌.నటరాజ్‌ – కొమరంభీం–ఆసిఫాబాద్‌
  • వై.వీ.గణేష్‌ – జయశంకర్‌ భూపాలపల్లి
  • బి.వెంకటేశ్వర్లు – మెదక్‌
  • జి.పద్మజారాణి – సూర్యాపేట
  • డి.శ్రీనివాస్‌రెడ్డి – యాదాద్రి భువనగిరి

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu