రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేరిన సచిన్ పైలట్

New INC Chief In Rajasthan, Rajasthan Crisis, Rajasthan Government Turmoil, Rajasthan political crisis, Rajasthan political crisis news, Rajasthan Political News, Sachin Pilot, Sachin Pilot Latest News, Sachin Pilot Removed From Deputy CM Post, Sachin Pilot Says not Joining in BJP

రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుంది. తిరుగుబాటు పరిస్థితుల దృష్ట్యా సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి, పార్టీ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా ఆయనను తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ మరోసారి స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్‌ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సచిన్‌ పైలట్ వెల్లడించారు. ముందుగా సచిన్ పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకున్న అనంతరం బీజేపీ స్పందిస్తూ సచిన్‌ పైలట్‌ను పార్టీ లోకి ఆహ్వానిస్తున్నట్లుగా‌ ప్రకటించింది. బీజేపీ విధివిధానాలు నచ్చితే ఎవరైనా తమ పార్టీలోకి రావొచ్చని ఆ పార్టీ నేతలు ‌ పేర్కొన్నారు. అయితే సచిన్‌పైలట్‌ తాజాగా బీజేపీలో చేరడం లేదని ప్రకటించడంతో అతని తదుపరి నిర్ణయంపై అంతటా ఆసక్తి నెలకుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + sixteen =