కరోనా చికిత్సకు వాడే మందులను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్న ముఠా అరెస్ట్

Black Marketing Covid Drugs, Black Marketing Covid-19 Drugs, Covid-19 Drugs, Eight arrested for black marketing Covid-19 drugs, Hyderabad, Hyderabad Coronavirus, Hyderabad Coronavirus News, Hyderabad Police Arrested 8 Members Gang, India Coronavirus

కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను హైదరాబాద్ నగరంలో బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ఒక ముఠాను జూలై 14, మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు చాదర్‌ఘాట్ ప్రాంతంలో 35 లక్షల విలువైన యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

మందులను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నందుకు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తితో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ముఠా కరోనా చికిత్సకు వాడే మందులను‌ రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని చెప్పారు. అలాగే వీరి వద్ద నుంచి కరోనా టెస్ట్‌ చేసే ర్యాపిడ్‌ కిట్స్‌, ఇంజక్షన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. బ్రోకర్లు లేదా నకిలీ ఏజెంట్లచే మోసపోయి దోపిడీకి గురికావద్దని ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా సందేహం ఉంటే వాట్సాప్‌లో 9490616555 నెంబర్ కు సమాచారం పంపాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 16 =