ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ ప్రారంభం, వివిధ రంగాలపై పూర్తి సమాచారం

Harish Rao, Invest Telangana, Invest Telangana Portal, Invest Telangana Website, Jagadish Reddy, Minister KTR, telangana government, Telangana government launches website, Telangana Investment promotion launches, Telangana unveils portal for investors

తెలంగాణ రాష్ట్రానికి మరింతగా పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ ను ప్రారంభించింది. జూలై 16, గురువారం నాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిల సమక్షంలో ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్ ‌ను (https://invest.telangana.gov.in/) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికీ అవసరమైన పూర్తీ సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

సరళతరమైన వాణిజ్య విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్నివెబ్‌సైట్‌లో పొందుపరచడంతో పెట్టుబడిదారులు చాలా సులువుగా సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని అంశాలతో ఈ వెబ్‌సైట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, అలాగే అంతర్జాతీయ భాషల్లోనూ వెబ్‌సైట్‌ను రూపొందించాల్సిన అవసరముందని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY