ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Andhra Pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Madhusudhan Reddy Tested Positive for Covid-19, Two AP MLAs Silpa Chakrapani Reddy

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా తేలింది. కర్నూల్ జిల్లా, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు. తాను క్షేమం గానే ఉన్నాయని, తనను కలవడానికి ఎవరూ రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు గత కొన్ని రోజుల్లో తనను కలిసిన వారిని కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సింగా సూచించారు. అలాగే చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇటీవల తనను కలిసివారు వారు అందరూ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 40646 కు చేరింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu