“కొవాగ్జిన్‌” వ్యాక్సిన్‌ పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

Bharat Biotech, Bharat Biotech Covaxin Vaccine, coronavirus vaccine, Coronavirus Vaccine COVAXIN, Covaxin Clinical Trials, Covaxin Vaccine, Covaxin Vaccine First Phase Clinical Trials, Covaxin Vaccine First Phase Clinical Trials Done, Covaxin Vaccine First Phase Clinical Trials Done on 375 Volunteers, India Coronavirus Vaccine

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. “కొవాగ్జిన్‌” పేరుతో భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సంయుక్తంగా తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్‌ ను మానవులపై ఫేజ్‌-1, ఫేజ్‌-2 ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్ పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది.

కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ ఫేజ్-1 క్లినికల్‌ ట్రయల్స్‌ జూలై 15 న ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. మొత్తం 375 మందితో దేశంలోని 12 సెంటర్లలో ఫేజ్-1 క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే సెంటర్లలో హైదరాబాద్‌ లోని నిమ్స్ ఆస్పత్రి కూడా ఉంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =