తిరుమలలో స్వామివారి దర్శనాలు ఆపండి – రమణ దీక్షితులు

Ramana Dikshitulu, Ramana Dikshitulu Asked Govt and TTD to Stop Darshans in Tirumal, Ramana Dikshitulu Asked Govt to Stop TTD Darshans, Tirumala Tirupati Balaji Temple, Tirumala Tirupati Devasthanam, Tirupati temple, TTD

తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు దర్శనాలు కొనసాగించడంపై ట్విటర్‌లో మరోసారి స్పందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా కొన్ని వారాల పాటుగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆయన కోరారు. అర్చకుల స్థానం మరొకరు భర్తీ చేయలేనిది చెప్పారు. అలాగే శ్రీవారికి ఆరాధన ఒక్క రోజు కూడా ఆపకూడదని, ఇది మానవ జాతికి మంచిది కాదని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో అర్చకులను రక్షించడానికి మరియు స్వామివారికి ఏకాంతంగా పూజలు కొనసాగించడానికి కొన్ని వారాలపాటు దర్శనాలను ఆపమని సూచిస్తున్నానని రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. మరోవైపు శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు టీటీడీ లో 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 18 మంది అర్చకులు సహా 100 మంది ఇతర సిబ్బంది కరోనా బారిన పడినట్టుగా తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 5 =