ఇకపై ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే షోలు, అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు: మంత్రి పేర్ని నాని

AP Cinema Regulation amendment bill passed, AP Cinema Regulation amendment bill passed in Assembly, AP Cinematograph Act Amendment Bill, Cinematograph Amendment Bill, Cinematograph Amendment Bill 2021, Mango News, Minister Perni Nani, Minister Perni Nani Presents AP Cinematograph Act Amendment Bill, Minister Perni Nani Presents AP Cinematograph Act Amendment Bill in Assembly, Perni Nani, Perni Nani Presents AP Cinematograph Act Amendment Bill

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సినిమా టికెట్ల విక్రయాల కోసం ఆన్‌లైన్ లో ప్రభుత్వ పోర్టల్ ద్వారా పారదర్శక విధానం అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజలందరికి మంచిగా అందుబాటులో ఉండేలా టికెట్ల ధరను తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో సినిమా థియేటర్లలో రోజూ 4 ఆటలు వేయాల్సింది, ఇష్టానుసారంగా 10 నుంచి 12 షోలు వేస్తున్నారు. అలాగే సినిమా పరిశ్రమలో ఏమి చేసినా ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రజల బలహీనతలు సొమ్ము చేసుకునే వ్యవస్థను కట్టడి చేసే విధంగా నిర్ణయం తీసుకుంటున్నాం. ఆన్‌లైన్ లో టికెట్లు అమ్మితేనే సినిమా థియేటర్లలో జరుగుతున్న దోపిడీ, వ్యవహారాలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. ఇకపై థియేటర్లలో షోలు కూడా ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే ప్రదర్శించాలి. సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడే నడుచుకోవాల్సి ఉంటుంది. సినిమా కలెక్షన్లు, కడుతున్న టాక్స్ లకు కూడా పొంతన కుదరడం లేదని మంత్రి తెలిపారు.

“ప్రభుత్వం తెచ్చే ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆన్‌లైన్ విధానంతో ఎవరూ టాక్స్ లు దాచి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉండదు. క్యూలైన్ లో నిలబడే అవసరం లేకుండా, టిక్కెట్లు తీసుకోవచ్చు. తక్కువ రేటుకు వినోదంతో పాటుగా ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో ఆదాయం సరిగా వస్తుంది. అలాగే టికెట్ల విక్రయాల కోసం తెచ్చే ఈ ఆన్‌లైన్ విధానంపై సినిమా డిస్ట్రిబ్యూటర్, సినిమా వాళ్ళు ప్రభుత్వంపై నిందలు వేస్తే అర్థం ఉంటుంది, కానీ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంపై బురద వేయడం దురదృష్టకరం. ప్రభుత్వం అప్పుల కోసం ఈ విధానం తెస్తుందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆన్‌లైన్ పోర్టల్ ఏపీ ఫిల్మ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆర్బీఐ గేట్ వే ద్వారా ఎప్పటికప్పుడే సినిమా హాళ్లకు డబ్బుల చెల్లింపు జరుగుతుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరు ఈ విధానాన్ని స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఈ విధానానికి అందరూ మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం” అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మంత్రి ప్రసంగం అనంతరం సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here