తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో ఎక్కువుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2083 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 31, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 64,786 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 21,011 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 530 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 46,502 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 17,754 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.7 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.81 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2083):
- జీహెచ్‌ఎంసీ – 578
- రంగారెడ్డి – 228
- మేడ్చల్ – 197
- వరంగల్ అర్బన్ – 134
- కరీంనగర్ – 108
- సంగారెడ్డి – 101
- నిజామాబాద్ – 73
- నల్గొండ – 48
- పెద్దపల్లి – 42
- మహబూబాబాద్ – 40
- రాజన్న సిరిసిల్ల – 39
- వరంగల్ రూరల్ – 39
- మంచిర్యాల – 38
- జోగులాంబ గద్వాల్ – 35
- భద్రాద్రి కొత్తగూడెం – 35
- సూర్యాపేట – 34
- ఖమ్మం – 32
- మహబూబ్ నగర్ – 31
- నిర్మల్ – 25
- జయశంకర్ భూపాలపల్లి – 24
- జనగామ – 21
- జగిత్యాల – 21
- వికారాబాద్ – 21
- ములుగు – 19
- నాగర్ కర్నూల్ – 18
- కామారెడ్డి – 18
- ఆదిలాబాద్ – 17
- మెదక్ – 16
- సిద్ధిపేట – 16
- యాదాద్రి భువనగిరి – 10
- వనపర్తి – 9
- నారాయణ్ పేట్ – 9
- ఆసిఫాబాద్ – 8
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu