స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన కేంద్ర మంత్రి

Coronavirus, Coronavirus Cases In India, Coronavirus Deaths In India, Coronavirus Higlights, Coronavirus In India, Ravi Shankar Prasad, Union Minister, Union Minister Ravi Shankar Prasad, Union Minister Ravi Shankar Prasad Isolates himself, Union Minister Ravi Shankar Prasad Isolates himself as per Precaution

కేంద్ర లా అండ్ జస్టిస్, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నేను బాగానే ఉన్నాను. అధికారిక సమావేశంలో భాగంగా శనివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశాను. ప్రభుత్వ నియమావళి ప్రకారం కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉంటాను. నేను ఇంటి నుండి పని చేస్తున్నాను మరియు యోగా, వ్యాయామంతో సహా రోజువారీ దినచర్యలను పాటిస్తున్నానని” కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ఆదివారం నాడు వెల్లడించిన సంగతి తెలిసిందే. అమిత్‌ షా ను కలిసిన నేపథ్యంలోనే కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఐసొలేషన్ లోకి వెళ్లారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu