తెలంగాణలో మరికొన్ని శాఖలలో ప్రారంభమైన ఈ-ఆఫీస్ విధానం

BRKR Bhavan, E-office in some other Secretariat Departments, Secretariat Departments, Somesh Kumar, telangana, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Launched E-office, Telangana News

ఆగస్టు 3, సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, మరియు హెఛ్ఓడీ లలో 2 శాఖలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ-ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి ఈ -ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకంగా , బాద్యతయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎక్కడ నుండైన పని చేయడానికి వీలుకలుగడంతోపాటు, సమర్దవంతమైన పాలనను అందించవచ్చన్నారు.

సెక్రటేరియట్ లోని వైద్య, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ , కార్మిక శాఖ, బిసి సంక్షేమం, షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధి శాఖ , మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, హోంశాఖలతో పాటు, పి.సి.బి, వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయాలలో ఈ-ఆఫీసును సీఎస్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సెక్రటేరియట్ లో 15 శాఖలలో ఈ-ఆఫీసును అమలు చేస్తున్నామన్నారు. మిగిలిన శాఖలలో ఈ-ఆఫీస్ అమలును వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పి.సి.బి. మెంబర్ సెక్రటరి నీతూ కుమారి ప్రసాద్ , ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరి రోనాల్డ్ రోస్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరి విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =