తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతి రోజూ 100 కి పైగానే కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 11, మంగళవారం ఒక్కరోజే 118 కరోనా మరణాలు, 5834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,649 కి చేరింది. మరోవైపు సోమవారం నాటికీ రాష్ట్రంలో 33,60,450 కరోనా పరీక్షలను నిర్వహించి, దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
తమిళనాడు కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 11, మంగళవారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 3,08,649
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 2,50,680
- యాక్టీవ్ కేసులు – 52,810
- ఆగస్టు 11 న నమోదైన కేసులు – 5834
- ఆగస్టు 11 న డిశ్చార్జ్ అయినవారు – 6005
- ఆగస్టు 11 న నమోదైన మరణాల సంఖ్య – 118
- మొత్తం మరణాల సంఖ్య – 5159
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu