విద్యార్థులకు శుభవార్త, యూఎస్ వీసా ప్రక్రియ ప్రారంభం

Hyderabad US Consulate, international news, Student Visa Processing, Student Visa Processing Resumed, US Embassy, US Embassy Announced to Resume Student Visa, US Student Visa, US to renew scholar visa processing

కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా దేశంలోని యూఎస్‌ కాన్సులేట్లలో వీసా పక్రియ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీసా కోసం ఎదురుచూస్తున్నా విద్యార్థులకు ఉపశమనం లభించింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాల లోని యూఎస్‌ కాన్సులేట్లలో ఆగస్టు 17, సోమవారం నుంచి విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభమవుతుందని భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ తాజాగా వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుగా స్టూడెంట్ మరియు అకాడమిక్ ఎక్సేంజ్ విజిటర్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ ను పరిమిత సంఖ్యలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఆగస్టు 12 కంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న వాటిలో అత్యవసర విద్యార్థి వీసాల ప్రక్రియను మొదటగా నిర్వహిస్తామని, ఆ తర్వాత పబ్లిక్ అపాయింట్‌మెంట్‌లను ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక సాధారణ ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసా సేవల నిలిపివేత కొనసాగుతుందని చెప్పారు. వీలైనంత త్వరగా సాధారణ వీసా సేవలను తిరిగి ప్రారంభిస్తామని, కాని నిర్దిష్ట తేదీని ఇప్పుడే చెప్పలేమని యూఎస్‌ ఎంబసీ ప్రకటనలో వెల్లడించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu