ఆసియా కప్-2022 షెడ్యూల్‌ విడుదల, ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్

India vs Pakistan To Be Played On 28th August As Asian Cricket Council Announces Schedule, Asian Cricket Council Released Schedule for Asia Cup 2022 IND vs PAK on August 28th, Asian Cricket Council Released Schedule for Asia Cup 2022, Schedule for Asia Cup 2022 IND vs PAK on August 28th, IND vs PAK on August 28th, Asia Cup 2022, 2022 Asia Cup, Asia Cup, India vs Pakistan Match Set for August 28, Asia Cup 2022 schedule, India vs Pakistan Asia Cup 2022, Asia Cup 2022 Teams List, Asian Cricket Council released the full-fledged schedule for the 2022 Asia Cup, Asia Cup 2022 News, Asia Cup 2022 Latest News, Asia Cup 2022 Latest Updates, Asia Cup 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఆసియా కప్-2022 షెడ్యూల్‌ విడుదల అయింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఈ రోజు (ఆగస్టు 2, మంగళవారం) షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ టోర్నీ ఆగస్టు 27న దుబాయ్‌ లో ప్రారంభం కానుండగా, ఫైనల్‌ సెప్టెంబర్ 11న జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేస్తూ, “ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఆసియన్ ఆధిపత్యం కోసం ఆగస్టు 27న యుద్ధం ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 11న అత్యంత ముఖ్యమైన ఫైనల్‌తోముగియనుంది. ఈ 15వ ఎడిషన్ ఆసియా కప్ ఐసీసీ టీ-20 ప్రపంచ కప్‌కు ముందు ఆదర్శవంతమైన సన్నాహకంగా ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.

ఆసియా కప్ లో భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు ఆసియా నుంచి మరో క్వాలిఫయర్‌ జట్టు తలపడనుంది. గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్థాన్‌, క్వాలిఫయర్‌ జట్లు ఉండగా, గ్రూప్‌-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘానిస్థాన్‌ జట్లు ఉన్నాయి. కాగా చాలాకాలం తరువాత భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్‌ లో తలపడనున్నాయి. దాయాదుల మధ్య పోరు దుబాయి వేదికగా ఆగస్టు 28న జరగనుంది. యూఏఈలోని దుబాయ్ మరియు షార్జా వేదికల్లోనే ఈ టోర్నీ యొక్క మొత్తం 13 మ్యాచ్‌ లు జరగనున్నాయి. షార్జాలో మూడు మ్యాచ్‌, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 10 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌ లో నిర్వహించనున్నారు. ముందుగా ఆసియా కప్-2022 శ్రీలంక వేదికగా నిర్వహించాల్సి ఉండగా, ఆ దేశంలో తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వేదికను యూఏఈకి మార్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twelve =