మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు

latest political breaking news, Mahatma Gandhi Death Anniversary, Mango News Telugu, national news headlines today, national news updates 2020, national political news 2020, PM Modi Pay Tribute To Mahatma Gandhi, President Kovind Pay Tribute To Mahatma Gandhi

ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ రాజ్‌ఘాట్‌ వద్దకు చేరుకొని, రాజ్‌ఘాట్‌పై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ, కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అలాగే చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే, నావీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదూరియా, తదితరులు రాజ్‌ఘాట్‌ ను సందర్శించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దేశంకోసం మహాత్మా గాంధీ చేసిన సేవలను, ఆశయాలను దేశ వ్యాప్తంగా నాయకులు, ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లోగల బాపూఘాట్ వద్ద తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులు అర్పించారు. గవర్నర్ తో పాటుగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, హోం మంత్రి మహమ్మద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కూడా బాపూఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here