దేశంలో 25 లక్షలు దాటిన కరోనా కేసులు: కొత్తగా 65,002 మందికి పాజిటివ్‌, 996 మంది మృతి

Corona Positive Cases Cross 25 Lakh Mark In India and Death Toll Reaches to 49036

భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది. ఆగస్టు 15, శనివారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,26,192 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 65,002 కరోనా పాజిటివ్ కేసులు, 996 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వలన మరణించిన వారి మొత్తం సంఖ్య 49,036 కు చేరింది. అయితే కరోనా మరణాల రేటు 1.95 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 71.17 శాతంగా ఉంది. మరోవైపు ఒకే రోజులో 57,381 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,08,936 కు చేరుకుంది.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు వ్యవధిలో నమోదవుతున్న కరోనా కేసుల్లో భారత్‌లోనే ఎక్కువుగా నమోదవుతున్నాయి. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. మరోవైపు కరోనా మరణాలు ఎక్కువుగా నమోదవుతున్న దేశాల్లో బ్రిటన్ ను దాటేసి భారత్‌ నాలుగో స్థానానికి చేరింది. అలాగే అత్యధిక కరోనా కేసులలో అమెరికా, బ్రెజిల్‌ దేశాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతుంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 15, ఉదయం 8 గంటల వరకు):

  • దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 25,26,192
  • కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 14–ఆగస్టు 15 (8AM-8AM)] : 65,002
  • నమోదైన మరణాలు : 996
  • డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 18,08,936
  • యాక్టీవ్ కేసులు : 668,220
  • మొత్తం మరణాల సంఖ్య : 49,036

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu