విషమంగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం

SP Balasubrahmanyam Continues to Remain Critical, on Ventilator and ECMO Support in ICU

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండ్రోజులుగా ఆయన చికిత్సకు స్పందిస్తూ, కోలుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఐసీయూలో వెంటిలేటర్‌ మరియు ఎక్మో సపోర్ట్‌ తో చికిత్స అందిస్తున్నట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలియజేశారు. మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అన్ని పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu