ఉసేన్‌ బోల్ట్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Coronavirus, Jamaica Sprinter Usain Bolt, Sprint King Usain Bolt Tests Positive For Coronavirus, Usain Bolt Coronavirus, Usain Bolt Tests Positive for Coronavirus, Usain Bolt tests positive for COVID-19

జమైకా స్ప్రింటర్, ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణ పతాకం గెలిచిన విజేత ఉసేన్‌ బోల్ట్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఉసేన్‌ బోల్ట్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని సోమవారం రాత్రి జమైకా ఆరోగ్య శాఖ నిర్ధారించింది, అలాగే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియో ద్వారా ఉసేన్‌ బోల్ట్ ‌స్వయంగా వెల్లడించారు. శనివారం కరోనా పరీక్ష నిర్వహించగా, పాజిటివ్ గా తేలిందని చెప్పారు. తనకు ఎటువంటి లక్షణాలు లేవని, ఫ్యామిలీ, స్నేహితులకు దూరంగా స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వీడియోలో ఉసేన్‌ బోల్ట్ పేర్కొన్నారు. ఆగస్టు 21 న తన 34వ జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరమే ఉసేన్‌ బోల్ట్ కరోనా బారిన పడినట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu