హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ గార్డెన్ పక్కన నిర్మించబోయే 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నమూనా చిత్ర పటాన్ని మంత్రి కేటిఆర్ సమక్షంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం నాడు విడుదల చేశారు. బి.ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విగ్రహ ఏర్పాటుకు 140 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తుంది. అలాగే 11.8 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసే పార్కులో అంబేద్కర్ విగ్రహంతో పాటుగా, లైబ్రరీ, మ్యూజియం కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున NTR గార్డెన్ పక్కన నిర్మించబోయే125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి విగ్రహ నమూనా చిత్ర పటాన్ని కెటిఆర్ గారి సమక్షంలో విడుదల చేయడం జరిగింది pic.twitter.com/XUeIoKWAlE
— Koppulaeshwar (@Koppulaeshwar1) September 16, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu