ఫ్లోరైడ్ ర‌హిత రాష్ట్రంగా తెలంగాణ‌, కేంద్ర గణాంకాల్లో వెల్లడి

#MissionBhagirath, Centre declares Telangana as Fluoride free state, Fluoride Affected Villages in Telangana, Fluoride free state, KTR, Minister KTR, Minister KTR On Fluoride Affected Villages, mission bhagiratha in telangana, No Fluoride Affected Villages in Telangana, telangana, Telangana Fluoride free state

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయానికి రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల సంఖ్య 967 ఉండగా, ప్రస్తుతం అది సున్నాకు చేరుకుంది. దీంతో తెలంగాణ ప్లోరైడ్ ర‌హిత రాష్ట్రంగా ఆవిర్భ‌వించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన గణాంకాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వలనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మిష‌న్ భ‌గీర‌థ టీమ్ కు మంత్రి కేటిఆర్ అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మం ద్వారా ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు సురక్షిత త్రాగు నీరును అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో తెలంగాణ‌లో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు లేవ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu