మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

#KCR, CM KCR Meeting with MLAs, CM KCR Meeting with MLAs and Mayors, dharani portal agriculture, kcr meeting, KCR Meeting with Municipal Corporations, Municipal Corporations, New Revenue Act, New Revenue Act of Telangana, Non-agriculture Properties online registraion, telangana

రాష్ట్రంలో రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు వంటి అంశాలపై గత రెండ్రోజులుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడు ప్రగతిభవన్ లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేతర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా సూచనలు, సలహాలుతో పాటుగా కీలక అంశాలపై సీఎం కేసీఆర్ వారికీ దిశానిర్దేశం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu