ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం

Congress Leaders Put Under House Arrest, Mango News Telugu, Political Updates 2019, Revanth Reddy And Other Congress Leaders Put Under House Arrest, Revanth Reddy Put Under House Arrest, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Strike Latest News, TSRTC Strike Latest Updates, TSRTC Strike News

తెలంగాణలో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 21న సోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకుని, వారి ఇంటివద్దే గృహ నిర్బంధం చేస్తున్నారు. మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మరో నాయకుడు షబ్బీర్ అలీని ఈ రోజు ఉదయమే గృహ నిర్బంధం చేసారు. ఉదయం 10 గంటల నుంచి గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా వెళ్లి ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకోగా పోలీసులు వారిని ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు.

పొన్నం ప్రభాకర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వంటి పాటు పలువురు నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ ముట్టడి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. అదే విధంగా నిరసనకారులు బేగంపేట్ మెట్రో స్టేషన్ లోకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా అధికారులు స్టేషన్ కు తాళం వేశారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 12 =