మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ డీన్ జోన్స్ కన్నుమూత

Australia Cricketer Commentator Dean Jones Passes Away, Commentator Dean Jones Passes Away, Dean Jones, Former Australia batsman, former Australia cricketer, Former Australia Cricketer Commentator Dean, Former Australia cricketer Dean Jones, Former Australia cricketer Dean Jones passes away, former Australian cricketer

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ డీన్ జోన్స్ కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. ఐపీఎల్ 2020 కోసం ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. డీన్ జోన్స్ తన కెరీర్ లో 52 టెస్టులు ఆడారు. 11 సెంచరీలతో సహా మొత్తం 3631 పరుగులు చేశాడు. 1986 లో చెన్నైలో భారత్ తో జరిగిన టెస్టులో ఆరోగ్యం సహకరించకపోయినా 210 పరుగుల చేసిన డీన్ జోన్స్ ఇన్నింగ్స్ ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాగే 164 వన్డేలలో 7 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలతో మొత్తం 6063 పరుగులు చేశారు. బ్యాట్స్ మెన్ గానే కాకుండా కామెంటేటర్ గా డీన్ జోన్స్ ఏంతో పేరు ప్రఖ్యాతలు గడించి, అభిమానులను సంపాదించుకున్నారు. డీన్ జోన్స్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here