అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా వంటేరు ప్రతాప్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSFDCL Chairman, TSFDCL Chairman Vanteru Pratap Reddy, Vanteru Pratap Reddy, Vanteru Pratap Reddy As TSFDCL Chairman, Vanteru Pratap Reddy Takes Charge As Chairman Of TSFDCL, Vanteru Pratap Reddy Takes Charge As TSFDCL Chairman

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా టీఆర్‌ఎస్‌ నాయకుడు వంటెరు ప్రతాప్ రెడ్డి నవంబర్ 6, బుధవారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు. మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, అటవీ అభివృద్ది సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనపై ఉంచి బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అడవులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు తగిన కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ రోజు బాధ్యతలు చేపట్టిన వంటేరు ప్రతాప్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 10 =