అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు విడుదల: అనుమతి ఉన్నవి, లేనివి ఇవే…

Cinema halls, Coronavirus Unlock 5, MHA issues Unlock 5.0 guidelines, MHA Unlock 5 Guidelines, States to Decide On Reopening of Schools, Unlock 5, Unlock 5 Cinema halls guidelines, Unlock 5 India, Unlock 5 School Reopening Guidelines, Unlock 5 travel guidelines, Unlock 5.0, Unlock 5.0 Explained, Unlock 5.0 Guidelines, Unlock 5.0 Guidelines & Rules

అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి నిచ్చారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్‌లాక్‌ 5.0 లో అనుమతి ఉన్నవి ఇవే:

  • అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్, మల్టీప్లెక్సులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్, సీటింగ్ సామర్థ్యంలో 50% తో అనుమతి.
  • అక్టోబర్ 15 నుంచి క్రీడాకారులు ట్రైనింగ్ కోసం వాడే స్విమ్మింగ్ పూల్స్ కు అనుమతి.
  • అక్టోబర్ 15 నుండి ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కు అనుమతి.
  • అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు మరియు కోచింగ్ సంస్థలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకే నిర్ణయం.
  • ఆన్‌లైన్/దూరవిద్య కొనసాగించాలి మరియు ప్రోత్సహించాలి.
  • విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరి .
  • కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు ప్రారంభంపై రాష్ట్రాల ఉన్నత విద్యా విభాగాలదే నిర్ణయం.
  • రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్‌ వర్సిటీలు ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం.
  • అక్టోబరు 15 నుండి పీజీ సహా రీసెర్చ్ విద్యార్థులు లాబొరేటరీల్లో ప్రయోగాలు ప్రారంభించుకోవచ్చు.
  • అక్టోబర్ 15 నుండి బిజినెస్ టూ బిజినెస్ ఎగ్జిబిషన్స్ కు అనుమతి.
  • సామాజిక/విద్య/క్రీడలు/వినోదం/సాంస్కృతిక/మత/రాజకీయ వేడుకలు సహా ఇతర సమావేశాలకు ప్రస్తుతం 100 మంది వరకు అనుమతి ఇస్తుండగా, అక్టోబర్‌ 15 తర్వాత 100 మందికి పైగా అవకాశం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయాధికారం కల్పించారు.
  • ఒక హల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం నింపేందుకు అనుమతి. అలాగే గరిష్టంగా 200 మంది మించకూడదు. మాస్క్‌ ధారణ, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్‌ స్కానింగ్, హ్యాండ్‌ వాష్‌/శానిటైజర్‌ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
  • అంతరాష్ట్ర ప్రయాణాలు సరుకు రవాణాపై ఎలాంటి నిషేధం లేదు.

అన్‌లాక్‌ 5.0 లో అనుమతి లేనివి ఇవే:

  • ఇంటర్నేషనల్ ప్రయాణం (కేంద్రం అనుమతించిన ప్రయాణాలను మినహాయించి).
  • అన్ని కంటైన్‌మెంట్‌ జోన్లలో అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌.
  • కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు స్థానికంగా లాక్‌డౌన్ విధించకూడదు.
  • 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దలు అత్యవసరమైతే బయటకు రావడం తప్ప, ఇళ్లల్లోనే ఉండడం మంచిది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu