హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు స్టెమ్ సెల్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిమ్స్ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నతమైన చికిత్స కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ రోజు మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించామన్నారు. ఈ సెంటర్ రోజుకు 10 వేల టెస్టులు చేయగల సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. అలాగే నూతనంగా ప్రారంభించిన స్టెమ్ సెల్స్ ల్యాబ్ ద్వారా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడేవారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలు అందించబడతాయన్నారు.
మరోవైపు రాష్ట్రంలో వారం, పది రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా ప్రజలకు యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయని ఐసీఎంఆర్ చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్ లేదా మామూలు వైరల్ ఫీవర్స్ తో ఎలా సహజీవనం చేశామో కరోనా వైరస్ కూడా సహజీవనం చేసే పరిస్థితి వస్తుందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu