అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుంది..

Triangle fight, Telangana BJP, Triangle fight in BJP,Jitender Reddy,Shanthi Kumar, DK Aruna, Telangana Politics, BJP, Telangana election, Mahbubnagar, Karimnagar, Nizamabad, Adilabad, Mango News Telugu, Mango News
Triangle fight in BJP,Jitender Reddy,Shanthi Kumar, DK Aruna, Telangana Politics, BJP

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న కొద్దీ.. తెలంగాణ బీజేపీ తమ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇప్పుడున్న సిట్టుంగు స్థానాలతో పాటు.. మరికొన్ని స్థానాలను దక్కించుకోవడానికి ఢిల్లీ పెద్దలు  ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా 17 స్థానాల్లో సగానిపైగా స్థానాలను దక్కించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర కమలం పార్టీ నేతలు కూడా.. కిందిస్థాయి బలగాన్ని సంసిద్ధం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌ కోసం కాషాయపార్టీలో హోరాహోరీ పోటీ నడుస్తోంది. టికెట్‌ తనదంటే తనదంటూ ఓ ముగ్గురు కీలక నేతలు పోటీ పడుతుండటంతో అధిష్టానం అయోమయంలో పడుతోంది. ఇద్దరు నేతలయితే డైరెక్ట్‌గానే  బహిరంగ యుద్ధం చేస్తుంటే, మరొక నేత  మాత్రం సైలెంట్‌గా తన పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు. మహబూబ్‌నగర్‌ టికెట్‌ కోసం ప్రస్తుతం జరుగుతోన్న ఈ ట్రయాంగిల్‌ ఫైట్‌ ఇప్పుడు పాలమూరు బీజేపీలోనే కాక.. తెలంగాణ పాలిటిక్స్‌లోనే కాకరేపుతోంది.

పాలమూరు టికెట్‌ తనదే అంటూ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి బీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు వాళ్లు రాజకీయాల్లో సీనియర్లు కావొచ్చు.. భారతీయ జనతా పార్టీలో  మాత్రం తానే సీనియర్‌ అని  టీబీజేపీ కోశాధికారి శాంతికుమార్‌ అదే కాన్ఫిడెన్స్‌తో ఉంటున్నారు. గతంలో రెండుసార్లు త్యాగం చేశా, ఈసారి మాత్రం తగ్గేదేలే అంటూ ధీమాను పెంచుకుంటున్నారు.డీకే అరుణ కూడా టికెట్ పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

మహబూబ్‌నగర్‌ తన గడ్డ, తన అడ్డా అంటూ పాలమూరు ఎంపీ టికెట్‌పై బోలెడు నమ్మకాన్ని పెంచుకుంటున్నారు జితేందర్‌రెడ్డి . బీజేపీ అధిష్టానం ఆశీర్వాదం, పెద్దల చూపు తనకే ఉందని.. తానే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తానని జితేందర్‌రెడ్డి చెప్పుకొస్తున్నారు. మరోవైపు శాంతికుమార్ కూడా తనకే టికెట్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈసారి బీసీకే టికెట్‌ ఇస్తారు కాబట్టి..అది తనకే దక్కుతుందంటూ టీబీజేపీ కోశాధికారి శాంతికుమార్‌ ఓపెన్‌గానే చెబుతున్నారు.

ఇటు వీరిద్దరికీ పోటీగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌‌పై గంపెడాశలు పెట్టుకున్నారు.   బాహాటంగా ఈ విషయాన్ని చెప్పకపోయినా సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతూ జితేందర్ రెడ్డి, శాంతికుమార్‌కు పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.  కాంగ్రెస్‌ పార్టీపై అగ్రెసివ్‌గా వెళ్తూ పాలమూరు టికెట్‌ రేస్‌లో తాను ఉన్నానని డీకే అరుణ చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ ముగ్గురిలో ఢిల్లీ పెద్దలు ఎవరికి టికెట్ ఇస్తారో..అసంతృప్తులను ఎలా చల్లారుస్తారో వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seven =