తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా 10 వేలకు చేరువైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కొత్తగా 5017 కరోనా పాజిటివ్ కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,30,408 కు, మరణాల సంఖ్య 9917 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 5548 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 5,75,212 కి చేరింది. ప్రస్తుతం 45,279 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు అక్టోబర్ 6 నాటికీ తమిళనాడు రాష్ట్రంలో 78,63,864 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu