తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అక్టోబర్ 8 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,80,953 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 1878 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 86.77 శాతంగా నమోదైంది. అలాగే రాష్ట్రంలో ఇప్పటికి 34,49,925 కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు గురువారం నాడు కొత్తగా నమోదైన 1891 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,08,535 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1208 కి పెరిగింది. ప్రస్తుతం 26,374 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1891):
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu