6 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు కొనాలి: సీఎం కేసీఆర్

CM KCR on Purchase of Crops in Villages, CM KCR will Conduct a Review with Officials, kcr latest news, KCR Review Wit Officials On Purchase of Crops in Villages, Purchase of Crops in Villages, Telangana Agricultural News, Telangana Agriculture Department, telangana agriculture minister, Telangana Agriculture News, Telangana CM KCR, Telangana CM KCR Latest News, Telangana Purchase of Crops in Villages

యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్టోబర్ 9, శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అయ్యే సమావేశంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు:

‘‘కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నది. దీని వల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శనివారం నాడు సమావేశంలో ఈ విషయంపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో సమీక్షిస్తారు.

6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి:

‘‘కరోనా నేపథ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించడం జరిగింది. ఇంకా కరోనా ముప్పు తొలగలేదు. అందుకే వర్షాకాలం పంటలను కూడా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలి. దీని కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయాలి’’ అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + eighteen =