రాష్ట్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభం

Bathukamma Sarees Distribution, Bathukamma Sarees Distribution Program, Bathukamma Sarees Distribution Program Started, Bathukamma Sarees Distribution Telangana, Distribution of Bathukamma sarees, Telangana Bathukamma Sarees Distribution

బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9, శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. 2020 సంవత్సరానికి గానూ 317.81 కోట్ల రూపాయలు వ్యయంతో 287 డిజైన్లతో, అనేక వర్ణాలతో కూడిన దాదాపు ఒక కోటి బతుకమ్మ చీరలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మహిళా సంఘాల ద్వారా లేదా ఇతర విధానాల ద్వారా బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =