తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, సభ ముందుకు నాలుగు సవరణ బిల్లులు

KCR Telangana Assembly Session, Telangana Assembly Sessions, Telangana Assembly Sessions 2020, Telangana Assembly Sessions News, Telangana Assembly Sessions Started, Telangana CM KCR, Telangana Legislative Assembly, Telangana News, Telangana Political News, Telangana Political Updates

అక్టోబర్ 13 న శాసనసభ, అక్టోబర్ 14 న శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలను మంగ‌ళ‌వారం ఉద‌యం స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ సహా మొత్తం నాలుగు చట్టాల సవరణ బిల్లులను ఈ రోజు‌ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించనున్నారు. ఈ సవరణ బిల్లులకు శనివారం నాడు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది.

నూతన రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ చట్టం-1955 సవరణ బిల్లు, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ చట్ట సవరణ బిల్లు, భూముల ధర నిర్ధారణలో సబ్‌ రిజిస్టార్స్ కున్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్‌ స్టాంప్‌ చట్టానికి సవరణ బిల్లును ఈ రోజు సభలో ప్రవేశపెట్టి, చర్చించిన అనంతరం ఆమోదం తెలుపనున్నారు. బిల్లులను శాసనసభ ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఇక శాసనసభలో ఆమోదం పొందిన చట్ట సవరణ బిల్లులను, రేపు శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu