మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు నామినేషన్ పక్రియ మొదలుకాగా, ఆఖరి తేదీ అక్టోబర్ 16 గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. సోలిపేట సుజాత నామినేషన్ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అక్టోబర్ 17 న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు గడువును అక్టోబర్ 19 గా నిర్ణయించారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఎం.రఘునందన్ రావు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu