సిద్దిపేటలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ క్యాంపెయిన్‌ చేపట్టిన మంత్రి హరీష్ రావు.. ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ

Minister Harish Rao Distributes National Flags To All Houses Today in Mulugu Siddipet During Har Ghar Tiranga Campaign, Telangana Minister Harish Rao Distributes National Flags To All Houses Today in Mulugu Siddipet During Har Ghar Tiranga Campaign, Harish Rao Distributes National Flags To All Houses Today in Mulugu Siddipet During Har Ghar Tiranga Campaign, Minister Harish Rao Distributes National Flags To All Houses Today in Mulugu During Har Ghar Tiranga Campaign, Minister Harish Rao Distributes National Flags To All Houses Today in Siddipet During Har Ghar Tiranga Campaign, National Flags Distribution To All Houses in Mulugu And Siddipet, Har Ghar Tiranga Campaign, National Flags Distribution, Har Ghar Tiranga, Telangana Health Minister Harish Rao, Telangana Minister Harish Rao, Health Minister Harish Rao, Harish Rao, Har Ghar Tiranga Campaign News, Har Ghar Tiranga Campaign Latest News, Har Ghar Tiranga Campaign Latest Updates, Har Ghar Tiranga Campaign Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో మంగళవారం ఆయన ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. దేశానికీ స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని, హర్‌ఘర్‌ తిరంగా క్యాంపెయిన్‌లో అందరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో.. సిద్దిపేట జిల్లా ములుగులో ఈరోజు మంత్రి హరీష్ రావు ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముందుగా గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం హరీష్ రావు స్వయంగా ఇంటింటికి తిరిగి గ్రామస్తులకు జాతీయ జెండా ప్రాముఖ్యతను వివరించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఆగస్టు 15 నాడు తమ ఇళ్లపై జెండాను ఎగురవేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ సహా స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 20 =