హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదల వలన నెలకొన్న పరిస్థితి పట్ల మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను అభినందించారు. సహాయ కార్యక్రమాల కోసం తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి 25 వేల రూపాయలను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. నగరంలో పరిస్థితి తొందరగా కుదుటపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ నరసింహన్ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu