నేడు ఓయూలో నిరుద్యోగ మహాదీక్ష నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

TPCC Chief Revanth Reddy House Arrest Ahead of Vidyarthi Nirudyoga Maha Nirasana Deeksha at OU Hyderabad,TPCC Chief Revanth Reddy House Arrest,Vidyarthi Nirudyoga Maha Nirasana Deeksha,Maha Nirasana Deeksha at OU Hyderabad,Mango News,Mango News Telugu,Congress leaders under house arrest,Osmania University Students Protest,Latest News on Telangana Congress,TPCC Chief Revanth Reddy Latest News,TPCC Chief Revanth Reddy Live News,Vidyarthi Nirudyoga Deeksha Latest News

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. కాగా శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఓయూ జేఏసీ నేతృత్వంలో ‘విద్యార్థి నిరుద్యోగ మహా నిరాసన దీక్ష’ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారనే సమాచారం మేరకు ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపడుతున్న ఈ దీక్షకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సంఘీభావం ప్రకటించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

అయితే మరోవైపు ఓయూలోని ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు, రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ ఉదయం నుంచి ఆయన ఇంటి దగ్గర భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేసిన పోలీసులు, అటువైపు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇక పోలీసుల వైఖరిపై రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో విద్యార్థుల జీవితాలు నాశనమవుతుంటే, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా శాంతియుత నిరసన తెలపడం తన హక్కు అని, తనను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ఈ అంశాన్ని తొక్కిపెట్టాలని భావిస్తోందని మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =