‌జహీరాబాద్ టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, MP BB Patil Tested Positive, Telangana Coronavirus, Telangana Coronavirus News, TRS MP BB Patil, TRS MP BB Patil Tested Positive, Zaheerabad TRS MP BB Patil Tested Positive, Zaheerabad TRS MP BB Patil Tested Positive for Covid-19

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‌జహీరాబాద్ టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ‌కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “తేలికపాటి లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారు, కలిసిన వారందరూ దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను” అని ఎంపీ బీబీ పాటిల్ ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 21 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,580 కి చేరుకోగా, 2,06,105 మంది ఇప్పటికే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu