యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ నాగ్ చివరి దశ ప్రయోగం విజయవంతం

India Anti Tank Missile Nag, India test-fires anti-tank missile Nag, India’s Anti Tank Missile Nag Passes Final Test, India’s anti-tank missile Nag ready for induction, India’s anti-tank missile Nag test-fired in Pokhran, Missile Nag, Missile Nag Passes Final Test, national news, national news today, Pokhran

భారత్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అక్టోబర్ 22 న 3 వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్(ఏటీజీఎం) నాగ్ చివరి దశ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. గురువారం ఉదయం 6.45 గంటలకు రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ రేంజ్‌ నుంచి నాగ్‌ మిసైల్‌ క్యారియర్ (ఎన్‌ఏఎమ్‌ఐసీఏ) ద్వారా దీనిని ప్రయోగించగా, మిస్సైల్ ముందుగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి కచ్చితత్వంతో చేదించిందని డీఆర్‌డీవో వెల్లడించింది. పగటి మరియు రాత్రి సమయాల్లో అత్యంత బలమైన శత్రు ట్యాంకులను సైతం ధ్వంసం చేసేలా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ నాగ్ ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.

తుది ప్రయోగం విజయవంతం కావడంతో, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ఉత్పత్తి దశలోకి ప్రవేశించనుంది. ఈ మిస్సైల్ ను డిఫెన్స్ పిఎస్‌యు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) ఉత్పత్తి చేయనుండగా, మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నాగ్‌ మిసైల్‌ క్యారియర్ (ఎన్‌ఏఎమ్‌ఐసీఏ) ఉత్పత్తి చేయనుంది. నాగ్ మిస్సైల్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్‌డీవో మరియు భారత సైన్యాన్ని అభినందించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + seven =