ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 న నిర్వహణ

Andhra Pradesh, Andhra Pradesh Formation Day, Andhra Pradesh Formation Day 2020, Andhra Pradesh formation day celebration, Andhra Pradesh Formation Day on November 1st, AP Govt Officially Declared to Celebrate Andhra Pradesh Formation Day, AP News, Celebrate Andhra Pradesh Formation Day on November 1st

నవంబర్ 1 వ తేదీన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజ‌ధాని, 13 జిల్లాల కేంద్రాల్లో అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌ని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే అవతరణ దినోత్సవ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్రభుత్వ మీడియా సలహాదారు జివిడి కృష్ణ మోహన్ నేతృత్వంలో 9 మంది అధికారుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేశారు.

న‌వంబ‌ర్ 1, 1956 న తెలంగాణ‌తో కూడిన‌ ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డగా, అప్ప‌టి నుంచి న‌వంబ‌ర్ 1 వ తేదీన రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వహించేవారు. అయితే 2014 లో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం ఏపీలో అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు. అవతరణ దినోత్సవ నిర్వహణపై చర్చలు జరిగినప్పటికీ, ఆచరణలోకి రాలేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం నవంబర్ 1 న జరిపేందుకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu