కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News, COVID-19, Smriti Z Irani Tests Positive, Smriti Z Irani Tests Positive for Covid-19, Union Minister Smriti Z Irani, Union Minister Smriti Z Irani Tests Positive, Union Minister Smriti Z Irani Tests Positive for Covid-19

దేశంలో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా సోకింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఇటీవల నన్ను సంప్రదించిన వారంతా త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్దిస్తున్నాను” అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. మరోవైపు అక్టోబర్ 28, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,90,322 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,20,010 కి పెరిగింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + five =