మెట్రో రైలు రెండవ దశ విస్తరణపై సీఎస్ సమీక్ష

CS Somesh Kumar, Hyderabad Metro Rail, Hyderabad Metro Rail Second Phase, Hyderabad Metro Rail Second Phase Expansion, Metro Rail Second Phase Expansion, Metro Rail Second Phase Expansion News, Somesh Kumar, Somesh Kumar Review on Metro Rail Second Phase Expansion, telangana, Telangana CS, Telangana CS Somesh Kumar

హెచ్ఎంఆర్ఎల్, హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటేడ్ బోర్డు సమావేశాలు సోమవారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో జరిగాయి. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మరియు హెచ్ఎంఆర్ఎల్ అండ్ హెచ్ఎఎంఎల్ చైర్మన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కోవిడ్ తదుపరి మెట్రో రైలు పునః ప్రారంభం, తీసుకున్న జాగ్రత్తలు, భద్రత, శానిటైజేషన్ చర్యలు, భౌతిక దూరం పాటించడానికి తీసుకున్న చర్యలు, ప్రయాణికులు మాస్కులు ధరించుట తదితర అంశాలపై సమీక్షించారు. మెట్రో రైలు ఆపరేషన్స్ రెండవ దశ విస్తరణ, ఎలివేటెడ్ బస్సు రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం ప్రాజెక్ట్ పై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

నగరంలోని కె.పి.హెచ్.బి మెట్రో స్టేషన్ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో రైల్ 2వ దశ విస్తరణ పనులు మరియు 18 కిలోమీటర్ల ఎలివేటెడ్ బస్సు రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం ప్రాజెక్ట్ పై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎండీ, హెచ్ఎంఆర్ఎల్, మున్సిపల్, ఆర్ అండ్ బి, ఆర్ధిక శాఖ, ఐటి శాఖల ముఖ్య కార్యదర్శులతో ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి మెట్రో రైల్ 2వ దశ, ఎలివేటెడ్ బస్సు రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్డు, మూసి రివర్ ప్రాజెక్టు తో పాటు ఇతర ముఖ్యమైన ట్రాఫిక్ కారిడార్ ను సంయుక్తంగా సందర్శించాలని సూచించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని మెగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి సమగ్ర ట్రాఫిక్ మరియు ట్రాన్స్ పోర్టేషన్ ప్రణాళికకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ