సిరిసిల్లలో ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్

Integrated Rythu Bazar in Sircilla, KTR, KTR Inaugurated the Integrated Rythu Bazar in Sircilla, KTR Latest News, Minister KTR, Rythu Bazar, Rythu Bazar in Sircilla, Sircilla, Sircilla Rythu Bazar, telangana, Telangana News

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జూన్ 23, మంగళవారం నాడు సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందులో భాగంగా రూ.5.15 కోట్లతో సిరిసిల్ల పట్టణంలో అధునాతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ ను మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ అనంతరం మార్కెట్ లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ను మూడు సంవత్సరాలలో పూర్తి చేయడం సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు. కరోనా సమయంలో కూడా ఒక్క రోజులోనే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమచేశామని, అలాగే రూ. 25 వేల లోపు రుణమాఫీని కూడా ఒకే దశలో అమలు చేశామన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో గొప్ప పురోగతి మొదలయిందని చెప్పారు. మరోవైపు ఇతర జిల్లాలకు ఆదర్శవంతంగా నిలిచేలా సిరిసిల్లలో ఏంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కొత్త రైతు బజారులో వ్యాపారులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మంత్రి కేటిఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − thirteen =