రూ.620 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

PM Modi Inaugurates and Lays Foundation Stone of Various Development Projects in Varanasi

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సొంత లోక్ సభ నియోజకవర్గమైన వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 220 కోట్ల రూపాయల విలువైన 16 పథకాలను ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించగా, వారణాసిలో ఇప్పటికే 400 కోట్ల రూపాయల విలువైన 14 పథకాలకు సంబంధించిన పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ రోజు ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులలో సారనాథ్ లైట్ అండ్ సౌండ్ షో, రామ్‌ నగర్ లోని లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ అప్‌గ్రేడేషన్, మురుగునీటి సంబంధిత పనులు, ద‌శ‌శ్వామేథ ఘాట్,‌ ఆవుల రక్షణ మరియు సంరక్షణ కోసం మౌలిక సదుపాయాలు, బహుళార్ధసాధక విత్తనాల స్టోర్‌హౌస్, 100 ఎంటి వ్యవసాయ ఉత్పత్తి గిడ్డంగి, ఐపిడిఎస్ ఫేజ్-2, సంపూర్ణనంద్ స్టేడియంలోని ఆటగాళ్లకు హౌసింగ్ కాంప్లెక్స్, వారణాసి సిటీ స్మార్ట్ లైటింగ్ వర్క్‌తో పాటుగా 105 అంగన్‌వాడీ కేంద్రాలు మరియు 102 గౌ ఆశ్రయ్ కేంద్రాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, వారణాసిలోని నగరం మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలో పర్యాటకం కూడా ఒక భాగమని అన్నారు. గంగా నది శుభ్రత, ఆరోగ్య సేవలు, రహదారి, మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగం, విద్యుత్, యువత, క్రీడలు, రైతులు మొదలైన రంగాల్లో వారణాసి ఎంతో వేగంగా అభివృద్ధి చెంది, అభివృద్ధికి ఒక ఉదాహరణగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ