ఇకపై పిల్లలకూ హెల్మెట్ తప్పనిసరి.. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ

Crash Helmet, Safety Harness To Be Mandatory For Children Below 4 Years on Motor Cycles

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే పిల్లలకు మరింత భద్రత కల్పించేందుకు కొత్త నిబంధనను చేర్చారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. రైడర్స్ తప్పనిసరిగా 9 నెలలు నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు హెల్మెట్ మరియు సేఫ్టీ బెల్ట్‌లను ధరింప చేయాలని సూచించింది. ఈ కొత్త ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘిస్తే ₹1,000 జరిమానా మరియు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు తెలిపింది. పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ద్విచక్ర వాహనదారులు వాహనం యొక్క వేగం గంటకు 40 కి.మీ మించకుండా ఉండాలని ఆదేశించారు. ఈమేరకు కేంద్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరించారు.

కొత్త నిబంధనల ప్రకారం.. ఉపయోగించే సేఫ్టీ హార్నెస్ తేలికగా, కుషన్‌తో ఉండాలి. ఇంకా 30 కిలోల బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ప్రయాణ సమయంలో పిల్లలను  సురక్షితంగా ఉంచడానికి రైడర్ పిల్లలను రెండు స్ట్రాప్‌ల సేఫ్టీ బెల్ట్‌తో కట్టాలి. హెల్మెట్‌లు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి ఉండాలి. పిల్లల కోసం హెల్మెట్‌లను తయారు చేయడం ప్రారంభించాలని కేంద్రం ఇప్పటికే తయారీదారులకు ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు గతేడాది అక్టోబర్‌లో మంత్రిత్వ శాఖ నిబంధనల్లో మార్పులను ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + seven =