ఏపీలో కరోనా: కొత్తగా 1392 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు

Covid-19 in AP : 1392 New Positive Cases, 11 Deaths Reported Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1392 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 9, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,44,359 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6802 కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కంటే కరోనా నుంచి కోలుకున్నవారే అధికంగా ఉన్నారు. గత 24 గంటల్లో 1549 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 61,050 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు. ఇక కరోనా వలన కృష్ణాలో ఐదుగురు, కడపలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు, గుంటూరులో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరియు తూర్పుగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6802 కి చేరింది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 5, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 87,25,025
  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,44,359
  • కొత్తగా నమోదైనా కేసులు : 1392
  • నమోదైన మరణాలు : 11
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,16,322
  • యాక్టీవ్ కేసులు : 21235
  • మొత్తం మరణాల సంఖ్య : 6802

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ