ఏ పద్ధతిలో విజేతను ప్రకటిస్తారు ?

If The Candidates Get Equal Votes In The Results?, If The Candidates Get Equal Votes, Equal Votes In The Results, Equal Votes, Candidates, Get Equal Votes In The Results, Each Constituency, Returning Officer, Counting Of Votes, Election Agent, Counting Agent, Election, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
candidates ,get equal votes in the results, Each Constituency, Returning Officer, Counting of Votes, Election Agent, Counting Agent, Election,

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవగా.. రెండు విడతల్లో  ఎన్నికల అధికారులు ఇప్పటికే పోలింగ్ ప్రక్రియను  పూర్తి చేశారు. మూడో విడత పోలింగ్ కు కూడా సర్వం సిద్దమయింది. మే 7వ తేదీన 12 రాష్ట్రాల్లో, 94 నియోజకవర్గాల్లో  ఎన్నికల కోసం పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు విడతల్లో ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో ఒకే నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు  వస్తే ఏం చేస్తారన్న అనుమానం చాలామందికి వస్తుంటుంది.   ఇలాంటి పరిస్థితుల్లో ఏ అభ్యర్థి గెలిచారా అన్నది ఎలా నిర్ణయిస్తారన్న ప్రశ్న వినిపిస్తుంటుంది.

ప్రతీ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను  రిటర్నింగ్ అధికారి  వహిస్తారు. ముఖ్యంగా ఎన్నికలలో అతి ముఖ్యమైన ఓట్ల లెక్కింపు బాధ్యత కూడా ఆయనే చూస్తారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం.. ఓటింగ్ ప్రక్రియ జరిగే ప్రతి ఎన్నికలలో కూడా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో పాటు ఆర్వో ఆదేశాలతోనే జరుగుతుంది. ఇది కాకుండా, ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో.. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థితో పాటు అతని తరఫున ఒక ఎన్నికల ఏజెంట్ అలాగే కౌంటింగ్ ఏజెంట్ ఉండే హక్కును కూడా ఈ సెక్షన్  కల్పిస్తుంది.

కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఒకవేళ ఇద్దరి అభ్యర్ధుల మధ్య ఓట్లు సమానంగా వచ్చాయనుకుంటే..అలాంటప్పుడు  సెక్షన్ 65 ప్రకారం తుది నిర్ణయం తీసుకోబడుతుంది. ఇలాంటపుడు రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఆ  అభ్యర్థుల గెలుపుపై  నిర్ణయం తీసుకుంటారు. లాటరీ విధానంలో, సమానంగా ఓట్లు వచ్చిన ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఒక  స్లిప్పుపై రాసి ఒక  చిన్న పెట్టెలో ఉంచుతారు. తర్వాత బాక్స్‌ను బాగా షేక్ చేసిన తర్వాత, రిటర్నింగ్ అధికారి దాని నుంచి ఒక చిట్టీని  బయటకు తీస్తారు. ఆ  స్లిప్‌‎పై ఏ అభ్యర్థి పేరు ఉంటే అతని పేరును ఎక్సట్రా ఓటుగా పరిగణించి.. ఆ ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. ఒక్కోసారి కాయిన్ ద్వారా బొమ్మా, బొరుసు వేసి టాస్ ద్వారా కూడా ఏ అభ్యర్థి గెలిచారో కూడా నిర్ణయం తీసుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nine =