కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

Corona Victims Can Utilize their Vote between 5 PM to 6 PM In GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్‌ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా కరోనాతో బాధపడుతున్న వ్యక్తులకు పోలింగ్ రోజున ఓటు వేసేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తూ తాజాగా ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది.

కరోనా బాధితులు డిసెంబర్ 1 వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ప్రకటించింది. అలాగే పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాలేని దివ్యాంగులు, మరియు 80 ఏళ్ళు పైబడిన పెద్దలకు, కరోనా బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. మరోవైపు పోలింగ్ కేంద్రానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలు క్యూలైన్ లో ఉండే అవసరం లేదని నేరుగా వెళ్లి పోలింగ్‌ కేంద్రంలోకి ఓటు వేయొచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీరి కోసం వీల్‌చైర్లు, వాలంటీర్లును కూడా అందుబాటులో ఉంచినట్టు ఎస్ఈసీ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ