దేశంలో 13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లో 10 లక్షలకు పైగా పరీక్షలు

India Crosses Milestone in Corona Testing, Held More than 13 Crore Tests Till Now

దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో ఇటీవల పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచారు. ప్రతిరోజు 10 లక్షలకు పైగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల్లో భారత్ మరో కీలక మైలురాయి దాటింది. దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 13 కోట్లు దాటింది. నవంబర్ 21 నాటికీ మొత్తం 13,06,57,808 శాంపిల్స్ ను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లోనే 10,66,022 కరోనా పరీక్షలను నిర్వహించారు. కాగా అక్టోబర్ 23 నుంచి నవంబర్‌ 21 వరకు కేవలం 29 రోజుల్లోనే 3 కోట్ల శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ప్రకటించారు. మరోవైపు నవంబర్ 21, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,50,597 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,32,726 కు పెరిగింది. ప్రస్తుతం 4,39,747 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు.

దేశంలో 13 కోట్ల కరోనా పరీక్షలకు పట్టిన సమయం వివరాలు:

  1. జులై 7, 2020 నాటికీ – కోటి శాంపిల్స్
  2. ఆగస్టు 3, 2020 – 2 కోట్ల శాంపిల్స్
  3. ఆగస్టు 17, 2020 – 3 కోట్ల శాంపిల్స్
  4. ఆగస్టు 29, 2020 – 4 కోట్ల శాంపిల్స్
  5. సెప్టెంబర్‌ 8, 2020 – 5 కోట్ల శాంపిల్స్
  6. సెప్టెంబర్‌ 17, 2020 – 6 కోట్ల శాంపిల్స్
  7. సెప్టెంబర్‌ 26, 2020 – 7 కోట్ల శాంపిల్స్
  8. అక్టోబర్‌ 6, 2020 – 8 కోట్ల శాంపిల్స్
  9. అక్టోబర్‌ 14, 2020 – 9 కోట్ల శాంపిల్స్
  10. అక్టోబర్‌ 23, 2020 – 10 కోట్ల శాంపిల్స్
  11. నవంబర్ 2, 2020 – 11 కోట్ల శాంపిల్స్
  12. నవంబర్ 11, 2020 – 12 కోట్లు శాంపిల్స్
  13. నవంబర్ 21, 2020 – 13 కోట్లు శాంపిల్స్

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 2 =