గ్రేటర్ ఎన్నికల్లో పార్టీల వారీగా పోటీచేసిన అభ్యర్థుల సంఖ్య ఇదే…

Final List of Candidates For GHMC Elections, Final List of Contesting Candidates For GHMC Elections, Final List of Contesting Candidates For GHMC-2020 Elections, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Mango News, Telangana SEC

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లకు గానూ 1122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి 150 డివిజన్లలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ నవాబ్‌ సాహికుంటలో మినహా మిగతా 149 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12 స్థానాల్లో పోటీ చేశాయి. కాగా ఈ ఎన్నికల్లో 415 మంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని జంగంమెట్‌లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు పోటీచేయగా, ఉప్పల్‌, టోలీచౌక్‌, జీడిమెట్ల, బార్కాస్‌, నవాబ్‌ సాహికుంట వంటి స్థానాల్లో అత్యల్పంగా ముగ్గురు చొప్పున పోటీ చేస్తున్నారు. 150 వార్డుల్లో పార్టీల వారీగా పోటీ చేసిన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ